జూలై 28కి వాయిదా పడిన తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 25న జరగాల్సిన ఈ భేటీ ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో నిలిపివేయబడింది. తాజా నిర్ణయం ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.

ఐదుగురు మంత్రుల్లో ముగ్గురు – పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి – ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ OBC సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు.

పూర్తిస్థాయి హాజరుతో చర్చలు జరగాలనే ఉద్దేశంతోనే సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రైతుల సమస్యలు, వానాకాలం సాగు, విద్యుత్ సరఫరా, భూ సర్వేలు, ఋణమాఫీ, కొత్త పాలసీలు వంటి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read More : మెదక్‌లో ప్రేమ వ్యవహారం ఘోరం: యువకుడి హత్య