తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రచ్చ చేయటమే తప్ప చర్చలకు సిద్ధం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రావాలని తాను సవాల్ చేయగా, సీఎం రేవంత్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు తాను అక్కడే ఎదురుచూస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిపోవడాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ.. “చర్చకు రాకుండా పారిపోయారు” అంటూ సెటైర్లు గుప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, “రేవంత్‌కు చర్చ చేయగల సామర్థ్యం లేదు. తన గురువు చంద్రబాబుకే విధేయుడిగా వ్యవహరిస్తున్నారు. సీఎం అయిన తర్వాత రేవంత్ తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రకు పంపిస్తున్నారంటూ” తీవ్ర ఆరోపణలు చేశారు. యూరియా బస్తాల కోసం రేవంత్ ఢిల్లీకి వెళ్లలేదని.. ఏ బస్తాలు మోసి పదవిలో ఉన్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్‌కు రాష్ట్ర పరిస్థితులపై తెలియదని, ఏ బేసిన్ ఎక్కడుందో కూడా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. నియామకాలు ఆయన అనుచరులకే పరిమితమయ్యాయని ఆరోపించారు. “రెండు నాలుగు రోజులు తప్పించుకోవచ్చు కానీ ప్రజలు క్షమించరు” అని హెచ్చరించారు. గతంలో కొండగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటను తప్పారని గుర్తు చేశారు.
తనతో చర్చకు ఎవరినైనా పంపుతారని భావించానని కానీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ప్లేస్, టైమ్ అయినా రేవంత్ నిర్ణయించాలనూ, తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. “ఈ స్థాయిలో చర్చకు కేసీఆర్ అవసరం లేదు… నేను చాలని” తెలిపారు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారన్న విషయాన్ని లేవనెత్తుతూ… బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరిస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Read More : అంబర్‌పేట బతుకమ్మ కుంటకు న్యాయపోరాటం విజయవంతం…

One thought on “సీఎం పై సోమాజిగూడలో కేటీఆర్ విమర్శల మోత”
Comments are closed.