మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ గ్రామంలో ఘోర హత్య చోటుచేసుకుంది. హైదరాబాద్ బోరబండకు చెందిన మహ్మద్ సాబిల్(21) అక్కడి యువతితో ప్రేమలో ఉండి ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే యువతి కుటుంబం పెళ్లికి నిరాకరించడంతో, వారిని అలాగే యువతి అన్న సయ్యద్ అప్సర్(34)ను నగ్న ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు.
ఈ నేపథ్యంలో ఫోటోలు డిలీట్ చేయమని పలుమార్లు కోరినా సాబిల్ వినకపోవడంతో అప్సర్ తన స్నేహితుడు సారోల్ల సంతోష్(39)తో కలిసి సాబిల్‌ను మాట్లాడుకుందామని పిలిచాడు. అనంతరం కారులో ఎక్కించుకొని ముగ్ధుంపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సాబిల్ తలపై బండరాయితో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు.
స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్సర్, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి చర్యల కోసం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Read More : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై డీకే అరుణ ఘాటు విమర్శలు

One thought on “మెదక్‌లో ప్రేమ వ్యవహారం ఘోరం: యువకుడి హత్య”
Comments are closed.