మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన “హరిహర వీరమల్లు” సినిమా చివరికి జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జూలై 23 రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ (ట్విట్టర్)లో ఆసక్తికరంగా స్పందించారు.
సీఎం ట్వీట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “చంద్రబాబు గారితో గత పదేళ్లలో అనేకసార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాలపై చర్చ జరగలేదు. కానీ ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆనందాన్ని కలిగించింది. నా బాధ్యతల నడుమ సినిమాకు సమయం కేటాయించేందుకు ఇచ్చిన సహకారం, విజయాన్ని ఆకాంక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

One thought on “హరిహర వీరమల్లు విజయంపై సీఎం ట్వీట్ – DCM స్పందన”
Comments are closed.