ఆంధ్రప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే, విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో తన అమ్మమ్మ ఇంటిలో ఉండి పదో తరగతి వరకు చదువుకుంది. ఈ సమయంలో ఆమెకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. హేమలత, భీమిలి సమీపంలోని చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజు అనే యువకుడిని బాలికకు పరిచయం చేసింది.
ఉపాధి కల్పిస్తానని నమ్మించి నూకరాజు బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఏప్రిల్ నెలాఖరులో జరిగిందని తెలుస్తోంది. అయితే, శనివారం బాలిక తల్లిదండ్రులు భీమిలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే బాలికను వైద్య పరీక్షల కోసం తరలించారు. అనంతరం నూకరాజుతో పాటు అతనికి సహకరించిన హైమావతిపై కూడా పీడీతులపై లైంగిక నేరాల నివారణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన తల్లిదండ్రులు, స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చిన్నారుల భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Read More : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్

One thought on “భీమిలిలో బాలికపై అత్యాచారం”
Comments are closed.