పవన్ కుమారుడికి గాయాలు – ఘటనపై జగన్ సహా పలువురు ప్రముఖుల స్పందన.

ఈ విషాద ఘటనపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన జగన్, “సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యాను. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి బాధ కలిగింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఇకపై ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, మాజీ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు స్పందించి, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు.

Read More : సింగపూర్ అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు – మంత్రి లోకేశ్‌ స్పందన