తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 2025 సీజన్లో దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్, భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం జరిగిన ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళ్‌తలైవాస్‌తో మ్యాచ్ సందర్భంగా, అశ్విన్ ఔటైన తీరు, అతని స్పందనపై తీవ్ర చర్చ నడుస్తోంది.
ఈ మ్యాచ్ ఐదో ఓవర్లో, తిరుప్పూర్ కెప్టెన్ సాయి కిషోర్ బౌలింగ్‌లో అశ్విన్ (18 పరుగులు) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యారు. అయితే, అంపైర్ కృతిక వెంకటేశన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విన్, నేరుగా ఆమె వద్దకు వెళ్లి బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయ్యిందని, అది ఔట్ కాదని వాదన సాగించాడు. “మేడమ్, అతను ఓవర్ ది స్టంప్స్ నుంచి బౌలింగ్ చేశాడు” అంటూ మైదానంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
టీఎన్‌పీఎల్ మ్యాచ్‌ల్లో డీఆర్ఎస్ లేకపోవడంతో అశ్విన్‌కు సమీక్షా హక్కు లభించలేదు. ఈ నేపథ్యంలో నిరాశకు గురైన అశ్విన్ మైదానం నుంచి వెళ్తూ తన బ్యాట్‌ను ప్యాడ్స్‌కి బలంగా కొట్టుకున్నాడు. అతని ప్రవర్తనపై ప్రేక్షకులు, మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు విస్తృతంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటన దిండిగల్ జట్టుపై ప్రభావం చూపింది. తక్కువ స్కోర్ అయిన 93 పరుగులకు జట్టు కుప్పకూలగా, తిరుప్పూర్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. దిండిగల్ డ్రాగన్స్కు ఇది సీజన్లో తొలి ఓటమి కావడం గమనార్హం.
Read More : ఇంగ్లండ్ vs భారత్ తొలి టెస్ట్‌కు జట్టు ప్రకటించిన ఈసీబీ.

One thought on “టీఎన్‌పీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ తీరుపై వివాదం.”
Comments are closed.