సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ అయ్యారు. అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కించపరిచిన వ్యాఖ్యల కేసులో ఆయనను ఆంధ్రప్రదేశ్ తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదు కావడంతో పోలీసులు ఆచూకీ స్థిరపర్చుకుని వెంటనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More : విద్యారంగ అవార్డు వేడుకల్లో పాల్గొననున్న మంత్రి.