చెట్టు నుంచి నీళ్లు రావడంతో హడావుడి

మహారాష్ట్ర పూణే జిల్లాలోని పింప్రి-చించ్వాడ్ నగరంలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ చెట్టు నుండి నీళ్లు వెలువడుతుండటాన్ని చూసిన స్థానికులు, ఇది దేవుడి లీలా అని భావించి పూజలు ప్రారంభించారు. చెట్టు చుట్టూ బారులు తీరిన జనాలు, ఆ నీళ్లను తాకి, సేవించేందుకు క్యూ కట్టారు.

ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన జరిపారు. చివరకు చెట్టు క్రింద ఉన్న నీటి పైప్ లైన్ పగిలి ఉండటమే నీరు వెలువడటానికి కారణమని స్పష్టమైంది. పైప్ లైన్ లీక్‌యి చెట్టు వేర్ల ద్వారా నీరు బయటకు వస్తుండటాన్ని స్థానికులు అర్థం చేసుకోలేక మాయగా భావించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో అనేకమంది ప్రజల్లో ఆధ్యాత్మిక ఉద్వేగం కలిగినప్పటికీ, అధికారులు దీనికి శాస్త్రీయ కారణమే ఉందని స్పష్టం చేశారు. చివరికి ఇది మాయ కాదు… మున్సిపల్ పైప్ లైన్ లీకే అని తేలింది.

Read More : ఆర్సీబీ విజయోత్సవాల్లో 11 మంది మృతిపై కేఏ పాల్ తీవ్ర ఆవేదన.

One thought on “చెట్టు నుంచి నీళ్లు రావడంతో హడావుడి

Comments are closed.