జిల్లాల పునర్విభజనపై సీఎం కీలక నిర్ణయం

cm Chandrababu

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు ప్రాంతాల పునర్వ్యవస్థీకరణపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులతో కలిసి ఆయన జిల్లాల పునర్విభజన అంశంపై సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై తొందరపడాలని సూచించారు. కూటమి హామీలపై సమగ్ర నివేదికను త్వరితగతిన సిద్ధం చేసి సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, అలాగే వివిధ ప్రజాసంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వాములుగా చేర్చాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా, హామీల అమలులో స్పష్టత ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read More : విశాఖ మున్సిపల్ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవిందరెడ్డి.

One thought on “జిల్లాల పునర్విభజనపై సీఎం కీలక నిర్ణయం

Comments are closed.