ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రక్తపాతం సృష్టించారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్ చేసి మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చారు. ఈ దాడిలో అడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు దుర్మరణం చెందారు.
దాడిలో ఇతర పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని అత్యవసరంగా చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి అదనపు బలగాలు చేరుకొని ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు మరోసారి భద్రతా వ్యవస్థను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. ఈ ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు.
Read More : చెట్టు నుంచి నీళ్లు రావడంతో హడావుడి
