విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికినవారిలో విశాఖ ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితలు కూడా ఉన్నారు.
తర్వాత ఉదయం 11 గంటలకు పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించనున్న ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి మరియు ఇంటర్ విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందించి అభినందించనున్నారు.
అంతకుముందు చినబొండపల్లి గ్రామంలో ఉత్తమ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్న మంత్రి, అనంతరం పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ భేటీలో పాల్గొననున్నారు. మంత్రి పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Read More : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

One thought on “విద్యారంగ అవార్డు వేడుకల్లో పాల్గొననున్న మంత్రి.”
Comments are closed.