సింగపూర్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో మర్క్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు సమాచారం. మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంచి పలు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నోవా తమ కుమారుడిని పర్యవేక్షిస్తున్నారు. కాగా, తాజాగా మార్క్ శంకర్ ఆసుపత్రిలో నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ చిత్రంలో మర్క్ తాను క్షేమంగా ఉన్నానని సంకేతాల రూపంలో చెబుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదంలో మార్క్‌కు చేతులు, కాళ్లపై స్వల్ప గాయాలు కాగా, పొగలు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురైనట్టు తెలిసింది. తొలుత అతడిని అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ప్రస్తుతం సాధారణ వార్డుకు తరలించారని సమాచారం. పవన్ అభిమానులు మర్క్ ఆరోగ్యంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు

One thought on “ఆసుపత్రిలో పర్యవేక్షణలో కొనసాగుతున్న పవన్ కుమారుడు”
Comments are closed.