తెలంగాణలో వర్షాల హెచ్చరికలు: పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ శాఖ ప్రకారం, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

అదేవిధంగా, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు పర్యవేక్షణలో ఉండాలని, అవసరమైతే అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More : నాచారం POCSO కేసులో 64 ఏళ్ల నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

One thought on “తెలంగాణలో వర్షాల హెచ్చరికలు: పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ..

Comments are closed.