ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని వెల్లడించారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ విధిస్తున్నట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
జగన్ పర్యటనపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం జగన్ పర్యటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పర్యటనలో నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ భద్రత విషయంలో, ఆయనకు ‘వన్ ప్లస్ వన్’ సెక్యూరిటీ మాత్రమే అందించబడుతోందని స్పష్టం చేశారు.
ఏపీ పోలీసుల రివ్యూ సమావేశంలో హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పోలీసు అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత రివ్యూ సమావేశం నిర్వహించారు. సాంకేతికతను ఉపయోగించి, నేరాలను అరికట్టడం, స్కూళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
Read More : ఆసుపత్రిలో పర్యవేక్షణలో కొనసాగుతున్న పవన్ కుమారుడు

One thought on “AP లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉన్నట్లు హోంమంత్రి అనిత వెల్లడి”
Comments are closed.