జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

andhra-pradesh-

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులకు అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా చంద్రబాబు జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కల్యాణ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. “జనసేన పార్టీ ప్రజాసేవ నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతోంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. “జనసేన 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నకు, జనసేన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయం. రాష్ట్ర పురోగతి, శ్రేయస్సులో జనసేన పాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుంది” అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో పిఠాపురం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.

Read More

One thought on “జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

Comments are closed.