చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి మధురై వైపు ప్రయాణిస్తున్న బస్సును గంగాసాగరం వద్ద ఒక టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటన కారణంగా బస్సు బోల్తాపడి రోడ్డు పక్కన ఉన్న కరెంటు పోల్‌ను బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరిని వెంటనే తమిళనాడు వేలూరు సీఎంసీ హాస్పిటల్, నరివి హాస్పిటల్‌కు తరలించారు. మిగతా బాధితులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..

One thought on “చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టి నలుగురు మృతి”
Comments are closed.