నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు
నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. కావలి వన్ టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బోగోలు మండలంలోని కోళ్లదిన్నెలో ఇటీవల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇరువర్గాల వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతుండగా ఇరువర్గాలు మళ్లీ గొడవపడ్డాయి. ఈ సమయంలో వైసీపీ నేతలను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకున్న కాకాణి గోవర్దన్ రెడ్డి, పోలీసులపై తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, పోలీసు అధికారులను ఎంత దూరమైనా వెంబడించి బట్టలూడదీస్తామని, అలాగే టీడీపీ కార్యకర్తలను వదిలేది లేదంటూ బెదిరింపులు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ నేత వంటేరు ప్రసన్న ఈ ఘటనపై కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు IPC సెక్షన్ల 224, 351/2, 352, 353/2 కింద కాకాణిపై కేసు నమోదు చేశారు.
ఈ వార్త కూడా చదవండి

One thought on “పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు”
Comments are closed.