నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులతో సమావేశమై పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా “ఆడబిడ్డ నిధి” (Aadabidda Nidhi) పేరుతో త్వరలోనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నిధి ద్వారా ఒక ఆడబిడ్డకు పెళ్లి లేదా ఉద్యోగం వచ్చేంతవరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకుని పని చేసే నాయకుడు చంద్రబాబునాయుడేనని మంత్రి ఆనం ప్రశంసించారు. గతంలో సూపర్ సిక్స్ పథకాలను కొందరు అవహేళన చేసినా, ప్రజలు నమ్మి గెలిపించారని ఆయన చెప్పారు.
ఆలయాలకు భారీ నిధుల కేటాయింపు
దేవాలయాల అభివృద్ధిపై కూడా మంత్రి ఆనం దృష్టి సారించారు. ధూప దీప నైవేద్యాల కోసం పూజారులకు ప్రతినెల రూ.10,000 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని 47 ఆలయాల అభివృద్ధికి రూ.43 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే, కాల్వబుగ్గ ఆలయానికి రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దుర్వేసి గ్రామ ప్రజల కోరనుబట్టి సుంకులమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం
రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించే నిర్ణయమని చెప్పారు.
ఈ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త ఆశలు, భద్రత కలిగించనున్నాయన్నది స్పష్టమవుతోంది.
Read More : టీటీడీ సమావేశం – పలు అభివృద్ధి నిర్ణయాలు
