2024 ఎన్నికల తర్వాత టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడంతో, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా కర్నూల్ పూడిచర్లలో జరిగిన ఫాం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సూచనపై కొణిదెల గ్రామాన్ని స్వయంగా దత్తత తీసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధి కోసం తన ట్రస్ట్ ద్వారా రూ.50 లక్షల కేటాయింపుతో పాటు అవసరమైన పథకాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రకటనతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పవన్ చేసిన హామీతో ఉత్సాహంగా ఉన్న గ్రామ ప్రజలు, ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, తమ గ్రామాన్ని గుర్తించి అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సత్కరించారు. ప్రజల ప్రశంసలతో ‘కొణిదెల’ ఇప్పుడు రాయలసీమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్‌కు ఈ గ్రామంతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ, అదే ఇంటిపేరు కలిగి ఉండటమే ప్రత్యేకతగా మారింది.
Read More : బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం కోర్టులో హాజరు పరుస్తున్న పోలీసులు…

One thought on “కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్..”
Comments are closed.