టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు విందు, ‘ఛలో రాజ్ భవన్’ నిరసన

కాంగ్రెస్: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలకు విందు

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ నేతలకు తాజ్ దక్కన్ హోటల్‌లో విందు ఇవ్వనున్నారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ నిరసన

ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో “ఛలో రాజ్ భవన్” నిరసన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు. అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనంపై దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపిచ్చింది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్‌కు ర్యాలీగా సాగనుంది.

ప్రదర్శన కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొంటున్నారు. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకల కారణంగా దేశవ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీసినట్లు కాంగ్రెస్ విమర్శించింది. అలాగే, మణిపూర్‌లో వరసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై ప్రధాని మోదీ స్పందించకపోవడంపై కూడా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయనుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీపీసీసీ పిలుపు

హైదరాబాద్ జిల్లాలో గౌరవనీయమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు గెలవడమే లక్ష్యంగా కార్యకర్తలను ప్రోత్సహించారు.