పొదిలి ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు

పొదిలి ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తినప్పుడు దానిని దారి మళ్లించడం దుర్మార్గమైన చర్య కాదా? అని ప్రశ్నించారు.

“మీరు హింసను రెచ్చగొట్టేందుకు 40 మందిని పంపారు. అదే సమయంలో అక్కడున్న 40 వేల మంది ప్రజలు స్పందించి ఆందోళనకు దిగితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి చంద్రబాబు!” అని వైఎస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More : పవన్ కళ్యాణ్ పటాన్‌చెరువు పర్యటన