విశాఖపట్నంలో పేకాట స్థావరంపై దాడి

విశాఖపట్నంలోని లలిత్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఓ వ్యక్తి తన భార్య ప్రతిరోజు పేకాట ఆడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు ₹22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More : తిరుపతి రేణిగుంటలో అగ్ని ప్రమాదం