తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఒక ఈచర్ ట్రక్కుకు స్కూటర్ అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కూటర్‌ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ ముందు అద్దాలు పగలగొట్టుకుని బయటపడటంతో సురక్షితంగా బయటపడ్డాడు. బోల్తా పడిన ట్రక్కుకు వెంటనే మంటలు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More : లిక్కర్ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు : CM

One thought on “తిరుపతి రేణిగుంటలో అగ్ని ప్రమాదం”
Comments are closed.