“ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదు” – న‌టి విన్సీ

Vincy Aloysius Drugs Case

తను ఒక న‌టుడి అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌తో సెట్స్‌లో తీవ్ర ఇబ్బందుల‌కు గురైనట్లు సినీ నటి విన్సీ అలోసియ‌స్ ప్రకటించారు. తన ముందే బ‌ట్ట‌లు మార్చుకోవాల‌ని ఆ న‌టుడు బ‌ల‌వంతం చేసాడని, అత‌డు సెట్స్‌లో డ్ర‌గ్స్ వాడుతుండ‌టం చూసానని ఆమె చెప్పింది. అయితే ఆమె ఆ న‌టుడి పేరు బహిరంగంగా చెప్పకుండా, తన ఫిర్యాదు చేసిన తరువాత ఫిలింఛాంబర్ పెద్ద‌లు షైన్ టామ్ చాకో పేరును లీక్ చేయడం జరిగిందని ఆరోపించారు.

విన్సీ చెప్పిన దాని ప్రకారం, ఫిలింఛాంబర్ లోని ఇంటర్నల్ కమిటీ , క్ర‌మశిక్షణా భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల‌పై విచార‌ణ చేపట్టాలని కోరినా, కమిటీ పెద్ద‌లు న‌మ్మ‌క ద్రోహం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచార‌ణ కొనసాగుతుండ‌గా, విన్సీ అప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, చ‌ర్య‌లు తీసుకోలేదు అని చెప్పింది.

తను ఈ విషయంపై ప్రస్తుతం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదని విన్సీ స్పష్టం చేశారు. అలాగే, షైన్ టామ్ చాకోపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, ఈ విషయంలో అంతర్గత పరిష్కారం కోసం ఫిలింఛాంబర్ వర్గాలను విన్సీ కోరింది.

అయితే, పోలీసులు, ఎన్సీబీ అధికారులు డ్ర‌గ్స్ సంబంధిత కేసు నమోదు చేసి, ఈ విష‌యాన్ని విచారిస్తున్నారు. షైన్ టామ్ చాకోపై జరిపిన విచారణ ఇంకా కొనసాగుతుండగా, చ‌ట్ట‌ప‌ర‌మైన శిక్షలు అమలు కావడం లేదని తేలింది.

Read More

One thought on ““ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదు” – న‌టి విన్సీ

Comments are closed.