స్టార్ హీరో కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, సన్యా మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ఇంకా 40 రోజులే మిగిలుండడంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించారు.
ఇటీవలి ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ త్రిషను ఆమె ఫేవరెట్ ఫుడ్ గురించి ప్రశ్నించగా, ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుండగా కమల్ హాసన్ నవ్వుతూ ‘పయం పూరి’ అని జోక్ విసిరారు. వెంటనే త్రిష నవ్వుతూ ఖండించిన ఈ సన్నివేశం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.
కమల్ వ్యాఖ్యలను కొందరు అవమానకరంగా అభిప్రాయపడితే, మరికొందరు సరదాగా తీసుకోవాలని అంటున్నారు. అయితే ఈ లైట్ మూడ్లో జరిగిన ఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. త్రిషను సరదాగా ఆటపట్టించారనే అభిప్రాయంతో కమల్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
ఇక థగ్ లైఫ్ సినిమా విడుదల విషయానికొస్తే, తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, ఓవర్సీస్‌లో హోమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్-ఏపీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదలకానున్న ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ్ శక్తివేల్ నాయకర్ పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

One thought on “థగ్ లైఫ్ ప్రమోషన్స్: త్రిషను ఆటపట్టించిన కమల్ హాసన్”
Comments are closed.