మంచు విష్ణు ‘కన్నప్ప’ – లవ్ సాంగ్ హాట్ టాపిక్!

Kannappa Love Song

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. భక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అవతారంలో కనిపించనుండటం విశేషం. దీంతో సినిమా హైప్ మరో స్థాయికి చేరుకుంది.

ఇటీవల విడుదలైన ‘సగమై.. చెరిసగమై’ అనే లవ్ సాంగ్ సినిమా చుట్టూ కొత్త చర్చకు తెరతీసింది. ఈ పాట విజువల్‌గా హాట్ టాపిక్ అవ్వడం గమనార్హం. హీరోయిన్ ప్రీతి ముకుందన్ గ్లామర్, మంచు విష్ణుతో ఆమె రొమాంటిక్ సీన్లు విపరీతంగా ఫొకస్ అయ్యాయని విమర్శలు వస్తున్నాయి.

భక్తి చిత్రంలో ఈ తరహా పాట అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తుండగా, “సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు స్టైల్‌ను ఫాలో అయ్యారని అనుకోవచ్చు” అంటూ మరికొంత మంది సెటైర్లు వేస్తున్నారు.

ఏదేమైనా, కన్నప్ప మూవీ ఇప్పుడు ప్రతి అంశంతో వార్తల్లో నిలుస్తూ, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది!

Read More

One thought on “మంచు విష్ణు ‘కన్నప్ప’ – లవ్ సాంగ్ హాట్ టాపిక్!

Comments are closed.