గన్నవరం కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ ఊరట

గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో ఊరట లభించింది. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఇప్పటివరకు ఈ కేసులో వంశీతో పాటు నిందితులుగా ఉన్న మరో నలుగురు వ్యక్తులు కూడా బెయిల్ పొందారు. అయితే వంశీపై మొత్తం ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయనను తక్షణమే విడుదల చేసే అవకాశమేమీ లేదు.

ప్రస్తుతం వంశీ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. గతంలో నమోదైన కొన్ని కేసుల్లో ఆయనకు స్టేషన్ బెయిల్ లభించినా, ఇంకా పలు కేసులపై విచారణ కొనసాగుతుండటంతో పూర్తి స్వేచ్ఛకు ఇంకా కాలమే సమాధానం. ఇతర కేసుల్లోనూ బెయిల్ లభించిన తరువాతే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

Read More : తిరుమలలో భక్తులకు శుభవార్త

One thought on “గన్నవరం కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ ఊరట

Comments are closed.