ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో డ్యామ్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. అలాగే, ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 199.27 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Read More : జేసీ-కేతిరెడ్డిల మధ్య పోటాపోటీ సవాళ్లు

2 thoughts on “శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద: 5 గేట్లు ఎత్తివేత”
Comments are closed.