సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వంశీ రిమాండ్ మంగళవారం ముగియనున్న నేపథ్యంలో, ఆయనను పోలీసులు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజరు పరచగా… న్యాయస్థానం రిమాండ్‌ను మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు తీర్పు ప్రకారం, వంశీ రిమాండ్‌ను రేపటి వరకు (బుధవారం) పొడిగించారు. దాంతో పోలీసులు వంశీని మళ్లీ విజయవాడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇదే కేసులో వంశీతో పాటు అరెస్టైన మిగిలిన నలుగురు నిందితులు గంటా వీర్రాజు, శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ చలపతి, వేల్పూర్ వంశీబాబు రిమాండ్ కూడా ఈరోజుతో ముగియనున్న నేపథ్యంలో వారిని కోర్టులో హాజరు పరిచారు. వారి రిమాండ్‌ను కూడా న్యాయస్థానం రేపటి వరకు పొడిగించింది.
ఈ కేసు విషయంలో నిందితులపై మరింత విచారణ కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తు నడుస్తుండగా, వంశీ సహా మిగతా నిందితులపై కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read More : ఓ తల్లి పసికందును హత్య చేసిన హృదయ విదారక ఘటన.

One thought on “వైసీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురుదెబ్బ.”
Comments are closed.