పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాక్‌ను ఎద్దేవా చేస్తూ ఆయన చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌లను ఉద్దేశించి ఓవైసీ “చైనా నుంచి అద్దెకు తెచ్చుకున్న విమానాన్ని రహీమ్ యార్ ఖాన్ వాయుస్థావరం మీద ల్యాండ్ చేయగలరా?” అంటూ ప్రశ్నించారు. భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఆ ఎయిర్‌బేస్ తీవ్రంగా ధ్వంసమైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఓవైసీ పరోక్షంగా పాక్ వాయుసేన బలహీనతను ఎత్తిచూపారు. పాక్ వాదనలపై సూటిగా స్పందించిన ఆయన ఈ ట్వీట్ ద్వారా పాకిస్థాన్ నాయకత్వాన్ని తక్కువ చేశారని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికపై వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ మద్దతు తెలియజేస్తున్నారు.
ఇటీవల పాక్ మీడియా, అధికారి వర్గాలు భారత వాయుసేనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం నిర్వహించాయి. అయితే వాటిపై ఓవైసీ కూడా స్పందిస్తూ పాకిస్థాన్‌ను ఎండగట్టడం గమనార్హం.
Read More : 11 మంది సైనికుల మృతి, 200 మందికి పైగా గాయాలు.

2 thoughts on “పాక్‌పై మళ్లీ సంచలన వ్యాఖ్యలు”
Comments are closed.