తిరుమలలో భక్తులకు శుభవార్త

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్న భక్తులకు శుభవార్తను అందించారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై తిరుమలలో దర్శన అవకాశం కల్పించే అంశంపై ఆయన కీలక ప్రకటన చేశారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే మంగళవారం (ఎల్లుండి) నుంచి తిరుమలలో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి స్వీకరిస్తుందన్నారు. గతంలో కరోనా, ఇతర కారణాలతో ఈ సిఫారసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ, తారీఖులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతోపాటు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగా కొంతమంది భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే, ఈ నిర్ణయం తెలుగురాష్ట్రాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్న భక్తులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ప్రజాప్రతినిధుల ద్వారా లేఖలు సేకరించి, ఆలయ దర్శనానికి ముందుగా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : వైసీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురుదెబ్బ.

One thought on “తిరుమలలో భక్తులకు శుభవార్త

Comments are closed.