వల్లభనేని వంశీ కేసు రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది
ఒవైపు పోలీసులు వంశీని పది రోజుల కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయగా, మరోవైపు లాయర్లు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కొత్త మలుపులు తిరుగుతుండటంతో రాజకీయ వేడి పెరుగుతోంది. కోర్టు విచారణలో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, తుది తీర్పును గురువారానికి వాయిదా వేశారు.
ఇక కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ ఎస్సీ, ఎస్టీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నందున సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని కోర్టుకు తెలియజేశారు. అయితే, దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడ జరిగింది? అనే అంశాలను అఫిడవిట్లో ప్రస్తావించారు.
ఈ కేసు రాజకీయ కోణం లో మరింత వేడెక్కుతోంది. వంశీ, సత్యవర్ధన్ వ్యవహారంలో వీడియోలు వరుసగా విడుదల అవుతున్నాయి. టీడీపీ వంశీ సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసి, సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన ఆధారాలు ఉన్నాయంటూ వాదించింది. దీనికి ప్రతిగా వైసీపీ కూడా మరో వీడియో విడుదల చేసి, పోలీసులే సత్యవర్ధన్‌ను బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది.
కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పు కోసం ఉత్కంఠ పెరుగుతోంది. ఇక వంశీ కేసులో తదుపరి పరిణామాలు ఏంటో చూడాలి!
Read More : అసెంబ్లీకి వెళ్లని జగన్.. జైల్లో వంశీని పరామర్శించడంపై వైఎస్ షర్మిల విమర్శలు
Our YouTube Channel Click Here

2 thoughts on “వల్లభనేని వంశీ కేసు: రాజకీయ వేడి మధ్య కోర్టు నిర్ణయం ఎంతకాలం?”
Comments are closed.