జగన్ డ్రామాలు నడవవు..

Minister Kollu Ravindra

మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా చూపిస్తూ, ఐ ప్యాక్ ద్వారా ప్రజలను మోసం చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ, ఆ డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు.

జగన్ డ్రామాలు నడవవు.. ప్రజలు తిరస్కరిస్తున్నారు – మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఐ ప్యాక్ మాయాజాలాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. శుక్రవారం గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ప్రశ్నించబోతున్నారనే భయంతోనే జగన్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని ఆరోపించారు.

పోలీసులను బెదిరించే రాజకీయాలకు జగన్ తెరతీశారని మండిపడ్డారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే కేసులు నమోదు చేయకూడదా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు జగన్‌ను గద్దె దింపినా, ఆయన వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. జగన్ మాటలు ఎవరికీ అర్థం కావడం లేదని, ఆయన ప్రవర్తనపై ప్రజలు విసుగు చెందుతున్నారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

Read More