అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు భారతీయులను నియమించుకోవడం తగ్గించి, అమెరికన్ల నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సూచనలను పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
వాషింగ్టన్ డీసీలో జరిగిన కృత్రిమ మేధస్సు (AI) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్త పెట్టుబడులు పెడుతున్న టెక్ కంపెనీల ధోరణి అమెరికన్లను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఉంది. మన దేశంలోని స్వేచ్ఛను ఉపయోగించుకుని చైనాలో కంపెనీలు స్థాపించడం, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడం, ఐర్లాండ్‌ను అడ్డంగా పెట్టుకుని లాభాలు తగ్గించడం ఇక సహించబోం. నా పాలనలో ఆ రోజులు ముగుస్తాయి” అని వ్యాఖ్యానించారు.
అమెరికాలోని టెక్ కంపెనీలు దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. “సిలికాన్ వ్యాలీకి సరికొత్త దేశభక్తి అవసరం. అమెరికానే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. మీరూ అదే చేయాలి. నేను కోరుకునేది కూడా అదే” అని ట్రంప్ హితవు పలికారు.
Read More : రష్యాలో ఘోర విమాన ప్రమాదం – ? మంది మృతి

One thought on “టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక”
Comments are closed.