మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రీతి రెడ్డి, భద్ర రెడ్డి ఇళ్లలోనూ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. ఐటీ అధికారులు సంబంధిత పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Read More : లిక్కర్ స్కామ్‌లో ఈడీ రంగంలోకి..?