తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ఏనుగులు ప్రత్యక్షమవడం కలకలం రేపింది. నిన్న రాత్రి ఏడో మైలు వద్ద అడవిలో నుంచి రోడ్డుపైకి వచ్చిన రెండు ఏనుగులను చూసిన భక్తులు తీవ్రంగా భయాందోళనకు లోనయ్యారు. తక్షణమే భక్తులు విజిలెన్స్, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేసి, అనుభవంతో ఏనుగులను మళ్లీ అడవిలోకి తరిమారు. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై భద్రత చర్యలు కట్టుదిట్టంగా కొనసాగించారు. అధికారులు భక్తులను ఎటువంటి భయాందోళన అవసరం లేదని తెలియజేశారు. తిరుమల ఘాట్ రోడ్డులో వన్యప్రాణుల సంచారం సాధారణమేనని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More : హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియా దుష్ప్రచారం

One thought on “తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం”
Comments are closed.