హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియా దుష్ప్రచారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా దుష్ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను గత రెండు రోజులుగా ట్రోల్ చేస్తున్నారని పేర్కొంటూ, “సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్” అంటూ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న అభాస్పద ప్రచారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తీర్పులపై అభ్యంతరం ఉన్నట్లు టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వ్యక్తిగత దుష్ప్రచారానికి దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా స్పందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పరిస్థితులపై స్పందించిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకాన్ని కోల్పోయేలా సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు భావిదాయకమని అన్నారు. న్యాయమూర్తులు చట్టపరంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ఆశయాన్ని తుంగలో తొక్కేలా కొన్ని వర్గాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అశాస్త్రీయ ప్రచారాలపై చర్చకు తెరలేపారు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వ్యవస్థలు పనిచేయాలని ఆశించడం ప్రమాదకరమని, అదే ధోరణిలో స్పందించకపోతే న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దుష్ప్రచారం సాగుతోందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏకంగా రాజ్యాంగ వ్యవస్థలే రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాయని, ఇది ఒక ఆందోళనకర పరిణామమని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏకంగా ‘రెడ్‌బుక్ పాలన’ సాగుతోందని, ప్రతి వ్యవస్థపై దాడులు జరగుతున్నాయని భావిస్తున్నారు న్యాయవర్గాలు.

ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సోషల్ మీడియా వేదికగా న్యాయమూర్తులపై వ్యక్తిగత స్థాయిలో దుష్ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

read more : ఏపీలో మెడికో విద్యార్థుల నిరసనపై పోలీసుల దౌర్జన్యం

One thought on “హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియా దుష్ప్రచారం

Comments are closed.