మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలంలోని ఎల్లంపేట స్టేజ్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు హైవేపై వేగంగా ఢీకొనడంతో ఘటన తీవ్రతరంగా మారింది. ఘర్షణ అనంతరం రెండు లారీల క్యాబిన్లలో మంటలు చెలరేగాయి. దీంతో లారీల్లోనే ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ : సీఎం

One thought on “మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Comments are closed.