ఏపీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్ చట్టవిరుద్ధమని తాను దాఖలు చేసిన పిటీషన్‌పై కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీం కోర్టులో విచారణ పూర్తైంది. జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చిన సమయంలో పేర్కొన్న కారణాలు వేరే వేర్వేరు అని, కస్టడీ రిపోర్టులో వేరే విషయాలు వచ్చాయని కసిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. అనంతరం విజయవాడకు తీసుకెళ్లిన తర్వాత అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారని తెలిపారు.
అరెస్ట్ సమయంలో లేదా కస్టడీ సమయంలో పీసీ యాక్ట్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, పిటీషన్‌లో మాత్రం కొత్త అభ్యంతరాలను లేవనెత్తడం సరి కాదని ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా పేర్కొన్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐడీ ఇతర రాష్ట్రాల్లో నోటీసులు జారీ చేయడంపై కూడా కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం కోర్టు ఇరు తరపుల వాదనలను సాయంత్రం వరకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన తర్వాత తీర్పును ప్రకటిస్తామని ధర్మాసనం తెలిపింది. అలాగే బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాల్సిన సూచన కూడా సుప్రీం కోర్టు చేసింది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వారు ఈ నిర్ణయాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు కోసం విచారణను ముగించింది.
Read More : తెలంగాణ పోలీసులు ఘన విజయం

One thought on “ఏపీ లిక్కర్ స్కాం: కసిరెడ్డి పిటీషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్”
Comments are closed.