దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్ గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్దే నటించగా, మమితా బైజు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. విజయ్ కెరీర్‌లో ఇది ఆఖరి సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం నెలకొంది.
తాజాగా, ‘జన నాయగన్’ విడుదల తేదీను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో విజయ్ చివరి సినిమా సంక్రాంతి పోటీకి సిద్ధమైంది. విజయ్ సినిమాలు సంక్రాంతి బరిలో ఎక్కువగా విజయం సాధించిన నేపథ్యంలో, ఈ మూవీపై అంచనాలు అమాంతంగా పెరిగాయి.
ఈ చిత్రాన్ని విజయ్ అభిమానులకు కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో హై బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు హెచ్. వినోద్ కూడా విజయ్ కెరీర్‌కు ఒక మైలురాయి గా నిలిచేలా ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం.
విజయ్ తన రాజకీయ ప్రయాణంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి ముందు ‘జన నాయగన్’ సినిమాతో గ్రాండ్ గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ సినిమా ఓ ప్రముఖ తెలుగు చిత్రానికి రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలా? లేక కేవలం తమిళ వెర్షన్‌కే పరిమితం చేయాలా? అనేదానిపై త్వరలో స్పష్టత రానుంది.

One thought on “దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!”
Comments are closed.