షాంపైన్‌లో మునిగి తేలిన అజిత్.. రేసింగ్‌లో ఘనవిజయం!

Ajith

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ మోటార్ రేసింగ్‌లో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఇటలీలో జరిగిన ముగెల్లో 12H రేస్ ఈవెంట్‌లో అజిత్ టీమ్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. రేస్ ముగిసిన వెంటనే, అజిత్ తన టీమ్ సభ్యులతో కలిసి షాంపైన్ షవర్ చేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేశారు. అతడి క్యాప్ నిండా షాంపైన్ పోసుకుంటూ, తన టీమ్‌తో ఆనందాన్ని పంచుకున్నారు.

అజిత్ కుమార్ సినిమాలు, మోటార్ స్పోర్ట్స్ రెండింటినీ సమాంతరంగా నడిపిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ, వరుసగా ట్రోఫీలు గెలుచుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఈ విజయం నేపథ్యంలో, అజిత్ పోడియంపై నిలిచి మరింత గౌరవాన్ని పొందారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, అజిత్ తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలను కూడా కలిగి ఉందని చిత్రబృందం వెల్లడించింది.

దీంతో పాటు, అజిత్ త్వరలోనే కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మొదట ఈ వార్త గాసిప్‌గా ప్రచారం అయినా, తాజాగా నిర్మాత ఆకాష్ బాస్కరన్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. అజిత్ రేసింగ్, సినిమాల్లో విజయాలతో దూసుకెళ్తుండటంతో, అభిమానులు మాత్రం ఈ గుడ్ న్యూస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Read More