తెలంగాణలో యూరియా కొరతపై హరీష్ రావు ఫైర్

harish rao

తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు నిద్రలేకుండా తిరుగుతున్నా ప్రభుత్వం కళ్ళు మూసుకుందని ఆయన విమర్శించారు. హరీష్ రావు మాట్లాడుతూ – “కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఇంటివద్దకే యూరియా అందించింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను యూరియా కోసం అల్లాడిస్తోంది. రుణమాఫీ పూర్తిగా కాలేదు, వరి బోనస్ డబ్బులు మూడు నెలలుగా బాకీగా ఉన్నాయి. రైతులను ఇలా నిర్లక్ష్యం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మచ్చ” అని అన్నారు. రైతులకు సహాయం చేయాల్సిన ప్రభుత్వమే వారిని పోలీసుల కాళ్లు మొక్కే పరిస్థితికి నెట్టిందని ఆయన ఆరోపించారు. “ఎన్నికలు వచ్చినప్పుడు రైతులే కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారు. అందాల పోటీలు నిర్వహించడానికి మీటింగులు పెట్టగలిగే సీఎం, రైతుల కోసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేకపోతున్నాడు” అని హరీష్ రావు మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ‘చేతగాని ముఖ్యమంత్రి’ అని ఆయన వ్యాఖ్యానించారు. “డిల్లీకి 51 సార్లు వెళ్లినా, రైతులకు యూరియా అందించే దమ్ము లేదు. యూరియా ఇవ్వని కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో అడ్డుకుంటాం. వెంటనే రైతులకు యూరియా ఇవ్వాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం” అని హెచ్చరించారు.

Read More : కేటీఆర్: “మేము ఏ కూటమిలోనూ లేము”

One thought on “తెలంగాణలో యూరియా కొరతపై హరీష్ రావు ఫైర్

Comments are closed.