మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2: ఎంపురాన్’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ కు కొనసాగింపుగా వస్తుండటంతో మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో అన్ని భాషల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మలయాళంలో ప్రీ-సేల్స్ రికార్డులను బద్దలు కొట్టగా, తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాపై మంచి స్పందన కనిపిస్తోంది. ఓటిటీలో ‘లూసిఫర్’ వీక్షించిన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లో గ్రాండ్ యాక్షన్ సీక్వెల్‌ను ఎంజాయ్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.50 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక మలయాళ సినిమాకు ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. మల్టీప్లెక్స్ థియేటర్లలో మలయాళ వెర్షన్‌కి కూడా మంచి స్క్రీన్ కౌంట్ ఇవ్వడం గమనార్హం.
ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా, తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. మోహన్‌లాల్ గత చిత్రాలు టాలీవుడ్‌లో ఎక్కువగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ఈసారి ‘ఎల్2: ఎంపురాన్’ మాత్రం ట్రైలర్ ద్వారా సూపర్ హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

One thought on “తెలుగు రాష్ట్రాల్లో ‘ఎల్2: ఎంపురాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ సంచలం!”
Comments are closed.