పచ్చ బ్యాచ్ సైకోలు ఎప్పటికప్పుడు మరింత దిగజారిపోతూ ఉంటారు. తాజాగా మరోసారి తమ అసలు స్వభావాన్ని బయటపెట్టారు. వైఎస్ జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని కించపరిచేలా విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఈసారి నెటిజన్లు వారిపై తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శలతో కూడా ఐటీడీపీ అనుచరులు మారకుండా, మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి గురించి అసత్య ప్రచారం చేస్తూ, తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తూ తప్పుడు ఆనందం పొందుతున్నారు.
రవీంద్రభారతిలో 8వ తరగతి చదువుతున్న దేవికారెడ్డి (Devika Reddy) ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్ ను కలిసింది. ఆ సమయంలో జగన్ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని పలకరించారు. ఆ తరువాత భావోద్వేగంతో దేవికారెడ్డి మీడియాతో మాట్లాడింది.
జగన్ అంటే ఎంతో ఇష్టమని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత అమ్మ ఒడి సహా పథకాలు నిలిచిపోయాయని ఉన్నదున్నట్లు చెప్పింది. అయితే, ఈ మాటలు పచ్చ బ్యాచ్ సభ్యులకు మింగుడుపడలేదు. దీంతో ఆ చిన్నారిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

One thought on “చిన్నారి అభిమానం చూసి మిన్ను మింటిన పచ్చ బ్యాచ్.. ట్రోలింగ్‌కు నెటిజన్ల కౌంటర్!”
Comments are closed.