మున్సిపల్ పాఠశాల ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి నియోజకవర్గంలోని మారిసుపేటలో ఉర్దూ విద్యకు మరో అడుగు ముందుకు పడింది. జనసేన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం చెంచు రామానాయుడు హైస్కూల్ ప్రాంగణంలో నూతనంగా సుందరీకరించిన మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలిలో ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. సుమారు రూ.70 వేల వ్యయంతో తన సొంత డబ్బులతో ఈ పాఠశాలను అందంగా తీర్చిదిద్దిన పాఠశాల ఉపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలు ఇతర ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలవాలని పేర్కొన్నారు.

ఇక పాఠశాలల అభివృద్ధి కోసం దాతల సహకారం అవసరమని, ప్రతి ఒక్కరు ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నా సూచించారు. విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

One thought on “మున్సిపల్ పాఠశాల ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

Comments are closed.