తోతాపురి మామిడి రైతులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మార్కెట్ జోక్యం పథకం కింద తోతాపురి మామిడిని చేరుస్తూ, రైతుల నష్టాన్ని తగ్గించేందుకు కేంద్రం రూ.130 కోట్ల నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది.
ఈ సత్ఫలితానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కలిసి చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ విధంగా రైతులకు సగం భరించేలా ప్రభుత్వం ముందుకొచ్చిందని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వలన తోతాపురి రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు, ఆర్థికంగా ఉపశమనం కూడా లభించనుందని మంత్రి స్పష్టం చేశారు.
Read More : అసంతృప్తిని వెల్లగక్కిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

One thought on “కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు ఫలితం”
Comments are closed.