తెలంగాణ ప్రభుత్వంపై కీలక నిర్ణయం: నీరా కేఫ్‌ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌కు బ‌దిలీ

నీరా కేఫ్‌ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌కు అప్ప‌గిస్తూ జీఓ జారీ

ప‌ర్యాట‌క శాఖ నుంచి రాష్ట్ర క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌కు బ‌దిలీ

సీఎంకు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ క‌ల్లుగీత విభాగం అధ్య‌క్షుడు నాగ‌రాజు గౌడ్ థ్యాంక్స్

ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన‌ నీరా కేఫ్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
నీరా కేఫ్ (Neera Cafe) ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్ (Kaligeetha Industrial Corporation) కు అప్ప‌గిస్తూ జీఓ (GO) జారీ చేసింది. ప్ర‌భుత్వం (Government) ఎక్సైజ్ (Excise), ప‌ర్యాట‌క శాఖ (Tourism Department) లతో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత నీరా కేఫ్ ను ప‌ర్యాట‌క శాఖ నుంచి రాష్ట్ర క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్ (State Kaligeetha Industrial Corporation) కు బ‌దిలీ చేసింది.

దీంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Minister Ponnam Prabhakar) కు, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ క‌ల్లుగీత విభాగం అధ్య‌క్షుడు నాగ‌రాజు గౌడ్ (TPCC Kaligeetha Division President Nagaraju Goud) ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇదిలాఉంటే… సుమారు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నీరా కేఫ్ (Neera Cafe) ను కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈత మొద్దులు, తాటిమొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్‌ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి జనాలు వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలు (Telangana cuisine) సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి (for the existence of Kaligeetha workers) ప్రతీకగా ఈ నీరా కేఫ్ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిద‌నేది వైద్య నిపుణుల మాట.

Read More : బెట్టింగ్ యాప్‌ల కేసు: రీతూ విచారణకు గైర్హాజరు – హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ

One thought on “తెలంగాణ ప్రభుత్వంపై కీలక నిర్ణయం: నీరా కేఫ్‌ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌కు బ‌దిలీ

Comments are closed.