కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఢిల్లీ పర్యటనలో అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని కోరితే, అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమని బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ, “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ పార్టీ సభ్యుడు మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఆయనను కలవకుండా అవమానిస్తారా?” అంటూ రాహుల్ గాంధీపై ప్రశ్నలు సంధించారు. కర్ణాటకలో అధికార మార్పిడి అంశం చర్చనీయాంశంగా మారిన వేళ, సిద్ధరామయ్యను కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే కాదు, గతంలో రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను అప్రజాస్వామికంగా తప్పించారని గుర్తు చేస్తూ, ఇదే కుటుంబం నుంచి పునరావృతమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇటీవల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రియాంక గాంధీని కలవడం, అదే సమయంలో సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కలవకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది కేవలం అపాయింట్‌మెంట్ లేని సమస్యగా కాక, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సిద్ధరామయ్యకు జరుగుతున్న అన్యాయంగా విశ్లేషణలు వస్తున్నాయి.
Read More : హర్యానాలో టెన్నిస్ క్రీడాకారిణి హత్యపై మిస్టరీ

One thought on “సిద్ధరామయ్యకు ఢిల్లీ పర్యటనలో అవమానం?”
Comments are closed.