ఎమ్మెల్యే ఇంట్లో అనుమానాస్పద ఆత్మహత్య

తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఇంట్లోని మూడో అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గత కొంతకాలంగా గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యే ఐలయ్యకు మధ్య అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. ఈ కారణంగానే ఇంట్లో వారం రోజుల క్రితం తీవ్ర వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి చివరకు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఆలేరు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Read More : బీఆర్ఎస్ నేతపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్య

One thought on “ఎమ్మెల్యే ఇంట్లో అనుమానాస్పద ఆత్మహత్య

Comments are closed.